- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనం అదృష్టవంతులం.. సాయికుమార్ పవర్ ఫుల్ డైలాగ్
కరోనాపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటులు స్వచ్ఛందంగా వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రముఖ సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
ఈ డైలాగ్ ద్వారా కరోనా పోరాటంలో ముందుడి నడిపిస్తున్న వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, రాజకీయ నాయకులు, వలస కార్మికుల కష్టాలను గుర్తు చేస్తూ.. మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్… ఇది కూడా భారమనుకుంటే ఎలా? అంటూ అద్భుతమైన డైలాగ్‌ను వినిపించాడు. ఆ డైలాగ్ వివరాల్లోకి వెళ్తే…
అందరికీ నమస్కారం.. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే.. నడిచే దేవుళ్లై ఎవరొచ్చినా? ఎప్పుడొచ్చినా, విసుగు, విరామం లేకుండా కరోనా పాజిటివ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు ఫణంగా పెడుతున్న వైద్యులం కాదు మనం. క్షేత్ర పాలకులై కరోనా బారి నుంచి ఈ సమాజాన్ని రక్షించడమే కర్తవ్యంగా.. మన కుటుంబాల కోసం తమ కుటుంబాలకి దూరంగా రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్న పోలీసులం కాదు మనం. స్వచ్చాగ్రహులై ఇల్లు వాకిలి విడిచి.. ఊరూ వాడా పరిసరాలను శుభ్రపరిచి, కరోనాను ఊడ్చి పడెయ్యడానికి చెమటోడ్చి పని చేస్తున్న పారిశుధ్యకార్మికులం కాదు మనం.
ఊరు కాని ఉర్లో, రాష్ట్రం కాని రాష్ట్రంలో పని చేస్తూ, ఈ లాక్‌డౌన్‌లో చిక్కుకుని బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్న వలస కార్మికులం కాదు మనం. ప్రజా సేవకులై ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా, కరోనాని కట్టడి చేయడమే ధ్యేయంగా, అహోరాత్రాలు పనిచేస్తున్న ప్రధాని, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులం కాదు మనం. అదృష్టవంతులం. నీడపట్టున కూర్చుని, కాలుమీద కాలేసుకుని వేడివేడి కాఫీలు, టీలు తాగుతూ, కావాల్సినవి వండించుకుని తింటూ టీవీలో ప్రోగ్రాములు, నెట్‌లో సినిమాలు చూస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, కామెంట్లు పెడుతూ, మన ఇంట్లో మనవారితో ఆనందంగా ఉంటూ ఇంట్లో ఉండడం కూడా భారమనుకుంటే ఎలా? మన ఇంట్లో, మనవారితో ఉండడమే మన బాధత్య జైహింద్ అంటూ పవర్ ఫుల్ డైలాడ్ చెప్పి అలరించాడు. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ఫేస్ బుక్‌పేజ్‌లో షేర్ చేసింది. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Tags: social media, arogyandhra, ap, corona virus, saikumar, powerful dailogue