నగరానికి నీటి కొరత ఉందా.. లేదా?

by Shyam |
నగరానికి నీటి కొరత ఉందా.. లేదా?
X

దిశ, హైదరాబాద్:
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నగర ప్రజలకు సరిపడా మంచినీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని వాటర్ బోర్డు ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. నగరంలో మంచినీటి సరఫరా- కావాల్సిన వసతులు, ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ కోవిడ్- 19 దృష్ట్యా మంచినీటి సరఫరా, సేవరేజ్‌కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి, సీవరేజ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు, లైన్‌మెన్లు, సేవరేజ్ సిబ్బంది, ఎయిర్ టెక్ మిషన్ సిబ్బంది, ట్యాంకర్ సిబ్బందికి తాత్కాలిక, వ్యక్తిగత, వెహికల్ పాసులు అందజేయాలన్నారు. అవసరమైతే పోలీస్ విభాగం సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. కరోనా ప్రబలే అవకాశం తీవ్రంగా ఉన్నందున మాస్కులు, గ్లౌజులు వంటి భద్రత పరికరాల నిమిత్తం ప్రతి అధికారికి రూ.5 వేల చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. శానిటైజర్‌ను జలమండలి ల్యాబ్‌లో తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రతి శనివారం సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు మంచినీటి సరఫరా, సేవరేజ్ వంటి సమస్యల ఫిర్యాదులకై డయల్ యువర్ ఎం.డి. కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సమన్వయంతో మంచినీటి, సివరేజ్ పనులు చేపట్టాలన్నారు. టెలీకాన్ఫరెన్‌లో ఈడీ డాక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్ బాబు, వాసుదేవనాయుడు, పి.రవి, వీఎల్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Tgas : corona, water board, water supply, hyderabad

Advertisement

Next Story

Most Viewed