- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జేమ్స్ బాండ్’ సినిమాలు చూస్తే ప్రైజ్‌మనీ.. ఎంతంటే..
దిశ, ఫీచర్స్ : ప్రజలకు వినోదాన్ని పంచడంలో ఎప్పుడూ ముందువరుసలో ఉండేవి ‘సినిమా’లు. లాక్‌డౌన్ సమయంలోనే కాదు నార్మల్ టైమ్స్‌లోనూ చిత్రాలు మనల్ని అలరిస్తాయి. అయితే సినిమాలను వెండితెరపై వీక్షించాలన్నా, ఓటీటీలో ఆస్వాదించాలన్నా అందుకు మనం డబ్బులు చెల్లించాల్సిందే. అలా కాకుండా సినిమా చూసినందుకు మనకే తిరిగి డబ్బులు చెల్లిస్తే ఎలా ఉంటుంది? ‘సూపర్’గా ఉంటుంది కదా. అయితే ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్ ఆఫర్ కాదు..ఇది ‘పాతిక సినిమా’ల ఆఫర్. అదేంటంటే..
‘జేమ్స్ బాండ్’..ఈ పేరు వింటే చాలు ఆ సినిమాల్లో ఉండే ఊహకందని యాక్షన్ సీన్లు, ఇన్వెస్టిగషన్..క్రైం, థ్రిల్లింగ్, ఎమోషన్స్ గుర్తుకువస్తాయి. అందుకే యాక్షన్ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ఫస్ట్ ప్రయారిటీ. హాలీవుడ్‌లో నిర్మితమయ్యే ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుండగా, బాండ్ చిత్రం ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 25వ సినిమాగా ‘నో టైమ్ టు డై’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. వాస్తవానికి ‘నో టైమ్ టు డై’ సినిమా గతేడాది నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో రిలీజ్ అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి వల్ల సినిమాను యూకేలో సెప్టెంబర్ నెలలో, యూఎస్‌లో ఆక్టోబర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నెర్డ్‌బేర్ (NerdBear.com) అనే వెబ్‌సైట్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లలో విడుదలైన మొదటి పార్ట్( 1962 నాటి Dr.No) నుంచి 2015లో విడుదలైన స్పెక్టర్ (Spectre) సినిమా వరకు 24 సినిమాలను చూస్తే, 1000 డాలర్ల (సుమారు రూ.73 వేలు) క్యాష్‌ప్రైజ్‌తో పాటు సినిమాలు చూసేందుకు 100 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదలయ్యే జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ చూసేందుకు 50 డాలర్ల ఏఎమ్‌సీ గిఫ్ట్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఆఫర్‌కు మనకు ఎంపిక కావాలంటే దరఖాస్తుదారులు జేమ్స్ బాండ్ అభిమాని ఎందుకయ్యారు? ఈ ఆఫర్ మీకే ఎందుకు ఇవ్వాలి? అనే ప్రశ్నలకు తగిన వివరణ ఇవ్వాలి. అంతేకాదు18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులు. యుఎస్ పౌరుడు లేదా శాశ్వత నివాసై ఉండాలి. ‘జేమ్స్ బాండ్’ సినిమాలంటే ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. 24 సినిమాల మొత్తం నిడివి 51 గంటలు కాగా వీటిని 30 రోజుల్లో చూస్తే మీరు రూ.73 వేలు సొంతం చేసుకోవచ్చు.