- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్ పార్కింగ్ కోసం కల్వర్టు కబ్జా
దిశ,కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బడా వ్యాపారస్తులు మున్సిపాలిటీ రోడ్లను కబ్జా చేస్తే, నేనేం తక్కువ తిన్నానా అంటూ అధికార పార్టీ అండదండలు మెండుగా ఉన్న 34 వార్డు కౌన్సిలర్ ఏకంగా కల్వర్టునే కబ్జా చేశారు. తాము నిర్మించుకున్న నాలుగు అంతస్తుల భవంతికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో నాలుగు ఏరియాలకు అనుసంధానం చేస్తూ నిర్మించిన డ్రైనేజీ పై నుంచి నిర్మించిన కల్వర్టును కబ్జా చేసి సుమారు 100 గజాల స్థలాన్ని స్లాబ్ వేయించి తమకు పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటున్నారు.
కల్వర్టు పై స్లాబ్ వేసేసరికి కాలువలో కూడుకు పోయిన వ్యర్ధాలను తొలగించడం కష్టసాధ్యంగా మారడంతో తేలికపాటి వర్షాలకు కాలువను ఆనుకొని ఉన్న సుమారు 15 ఇళ్ల వరకు నీట మునుగుతున్నాయి. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతో తమ ఫిర్యాదును ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే వారు కొత్తగా కొనుక్కున్న ఆడీ కార్ కి పార్కింగ్ కోసమని సిల్లీగా సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.