- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పోలీస్ సార్ సల్లగుండాలి.. సీపీని దీవించిన వృద్ధురాలు
దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించిన నేపథ్యంలో ఓ సన్నివేశం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వృద్ధమహిళ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు ఉప్పల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సింది పోయి మరో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తీరా ఓటు వేసే సమయంలో తను ఓటు వేయాల్సింది ఈ కేంద్రంలో కాదంటూ ఎన్నిక సిబ్బంది ఆ వృద్ధురాలికి తెలపడంతో వృద్ధాప్యం.. అందులో నడవలేని స్థితిలో ఉండడంతో ఒక్కసారిగా నిస్సహాయస్థితిలో పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వద్దే కూర్చుండిపోయింది.
అదే సమయంలో పోలింగ్ కేంద్రాన్ని పరీశీలించేందుకు వచ్చిన పోలీస్ కమిషనర్ సదరు వృద్ధురాలిని గమనించి ఆమె వద్దకు వెళ్లి జరిగిన విషయం తెలుసుకున్నాడు. అనంతరం సీపీ యే స్వయంగా తన వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాల చిట్టాలో వృద్దురాలి వద్ద ఉన్న పోల్ చిట్టీ ఆధారంగా సదరు వృద్ధురాలు ఓటు వినియోగించుకోవాల్సిన పోలింగ్ కేంద్రాన్ని గుర్తించి ఆ వృద్ధురాలిని ఆటోలో పోలింగ్ కేంద్రానికి పంపించారు. నడవలేని స్థితిలో ఉన్న తనని పోలింగ్ కేంద్రానికి ఆటోలో పంపించిన పోలీస్ సార్ సల్లంగుండాలని ఆ వృద్ధురాలు సీపీని దీవించింది. పోలీస్ కమిషనర్ కు వృద్ధుల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు, ఓటర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
- Tags
- blessings