- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి అంత్యక్రియలకు ప్రత్యేక శ్మశాన వాటికలు
దిశ, వరంగల్ సిటీ: కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని సాధారణంగా వారి స్మశాన వాటికల్లో దహనం చేయడానికి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను స్మశాన వాటికలకు తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాల దహనం సాఫీగా జరిగేందుకు వారి సంబంధీకులు సహకరించడానికి డీఎఫ్‌ఓ కిశోర్ ఆధ్వర్యంలో 12 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
బల్దియాలో కరోనాతో బాధపడుతున్న కిందిస్థాయి ఉద్యోగులకు హోమ్ క్వారెంటైన్ నిమిత్తం మున్సిపల్ అతిథి గృహాన్ని, హన్మకొండ మచిలిబజార్‌లోని కమ్యూనిటీ హాళ్లను వెంటనే సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారికి బల్దియా ఆధ్వర్యంలో భోజనం సదుపాయం కల్పించనున్నట్టు కమిషనర్ తెలిపారు.