- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్‌కార్ట్
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లుగా భారత్‌లో ఏ వస్తువైనా ఆన్‌లైన్ (Online) ద్వారా ఆర్డర్ (Order) పెట్టుకునే వెసులుబాటు ఉంది. కరోనా (Corona) నేపథ్యంలో మెడిసిన్ ఆన్‌లైన్ డెలివరీకి (Medicine Online Delivery)డిమాండ్ పెరిగింది. అయితే, కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, లిక్కర్ డెలివరీ (Liquor delivery)కి కూడా అనుమతులిస్తోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు అనుమతులను మంజూరు చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు (Online delivery companies) లిక్కర్ డెలివరీ (Liquor delivery)కి సిద్ధమవుతున్నాయి. ఇదివరకే ఫుడ్ డెలివరీ (Food delivery) సేవలను అందిస్తున్న జొమాటో, స్విగ్గీలు (Zomato, Swiggy) లిక్కర్ డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించగా, దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (E-commerce company Flipkart) కూడా ఇందులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ఇటీవల దేశంలోని లిక్కర్ కంపెనీ (Liquor Company)ల్లో ప్రముఖ కంపెనీగా ఉన్న డైజియోతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీకి చెందిన హిప్‌బార్ (Hipbar) పేరున ఉన్న యాప్‌తో ఫ్లిప్‌కార్ట్ జత కట్టి, ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి డైజియోకు చెందిన హిప్‌బార్ యాప్ (Hipbar App)సొంత అవసరాలకు రూపిందించింది కావున, ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం ద్వారా పరిమిత ప్రాంతాల్లోనే ఈ సేవలు ఉండనున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఈ సేవలను దేశవ్యాప్తంగా అమలు పరిస్తే కరోనా నిబంధనలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) కేసులు తగ్గే అవకాశాలున్నాయని, ఇంకా ఇతర ప్రయోజనాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకు మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ (E-commerce company) అమెజాన్ (Amazon) కూడా ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ (Online Liquor Delivery) సేవల్లోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. మిగిలిన విభాగాల్లో మాదిరిగానే లిక్కర్ డెలివరీ విభాగంలోనూ ఈ రెండు కంపెనీలు పోటీ పడనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.