- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
10 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యం : వాల్‌మార్ట్!
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ రిటైల్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ సంస్థ 2027 నాటికి ప్రతి ఏటా భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 73.5 వేల కోట్లు) విలువైన ఎగుమతులను నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న దాంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని వాల్‌మార్ట్ తెలిపింది. ఈ లక్ష్యానికి ముఖ్యంగా ఆహారం, ఔషధాలు, వినియోగ వస్తువుల విభాగాలు కొత్త సరఫరాదారులను పెంచేందుకు సహాయపడనుంది. అలాగే, దుస్తులు, హోమ్‌కేర్, సాధారణ వస్తువులు భారత్ నుంచి ఎగుమతి విభాగంలో ప్రధానంగా ఉండనున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఎగుమతుల లక్ష్యం కారణంగా భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని వాల్‌మార్ట్ వివరించింది. ప్రపంచ రిటైల్ రంగం విజయానికి స్థానిక పారిశ్రామికవేత్తలు, తయారీదారులు ముఖ్యమని వాల్‌మార్ట్ భావిస్తోందని వాల్‌మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్, సీఈవో డోగ్ మెక్‌మిలన్ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా అవకాశాన్ని పెంచడం ద్వారా భారతీయ సరఫరాదారులు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు.