- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం.. మాట నిలబెట్టుకోండి : వీఆర్వోల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: రద్దయిన వీఆర్వో పోస్టులను పునరుద్ధరించి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేస్తామని, సరిసమానమైన హోదాను కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబరు 9న 5,485 వీఆర్వోల పోస్టులను రద్దు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ చార్ట్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విలువైన భూములను కాపాడే విధులను నిర్వహిస్తున్నాం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నామని ప్రకటించింది.
అనైతిక ఆలోచనలతో తొందరపాటు తనంతో వీఆర్వో పోస్టులను, జాబ్ చార్ట్‌ను రద్దు చేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అనాలోచితమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో పని చేస్తున్న వీఆర్వోలకు పదోన్నతి లేకుండా అనిచివేతకు గురయ్యారన్నారు. 10 నెలల నుంచి సీఎం కేసీఆర్, సీఎస్‌లు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారన్నారు.
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీఆర్వోలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనన్నారు. వీరి సంక్షేమ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఎస్సీలకు దళిత బంధు, బీసీ సామాజిక వర్గాలకు బర్లు, గొర్లు, ఓసీ సామాజిక వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. కానీ ప్రజలకు నేరుగా సేవలందించే రెవెన్యూ శాఖను విచ్ఛిన్నం అవుతుంటే ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ పోస్టు, సీసీఎల్ఏ పోస్టులను భర్తీ చేయకుండా చీఫ్ సెక్రెటరీ అదనపు బాధ్యతలుగా నిర్వహించడం మోయలేని భారమన్నారు.
ఖాళీలను భర్తీ చేయకుండా 33 జిల్లాలకు 10 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులను సర్దుబాటు చేయడమంటే ఉద్యోగుల శ్రమను దోచుకోవడమేనన్నారు. తహశీల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించకపోవడం ఉద్యోగుల హక్కులను తుంగలో తొక్కినట్టేనని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు చాలీచాలని జీతాలతో పని చేస్తు వీఆర్ఏలకు స్కేలు ప్రకటించినప్పటికీ అమలు చేయకపోవడం వల్ల వారి భవిష్యత్తు అంథకారమైందన్నారు. వీఆర్వోలకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిలిపేయడం ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినట్లేనన్నారు. ప్రభుత్వానికి నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి ప్రధానం అనుకుంటే అధిక సంఖ్యలో ఉన్న తమను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.