- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VRO వ్యవస్థ రద్దు.. రికార్డుల స్వాధీనానికి ఆదేశాలు?
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న VRO వ్యవస్థ రద్దు చేయనున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఓల నుంచి అన్ని రకాల రికార్డ్స్ ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
వీఆర్వోల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రెవెన్యూతోపాటు అన్ని రకాల రికార్డులు స్వాధీనం చేసుకొని, సాయంత్రం ఐదు గంటల వరకు సీసీఎల్ కు పంపాలని కలెక్టర్లుకు ఇచ్చిన ఆదేశాలలో సీఎస్ స్పష్టంగా పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థ పై అవినీతి ఆరోపణ ఎక్కువ ఉండటంతో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
వీఆర్వోల విధులకు సంబంధించిన ప్రస్తుతం పాత పహణీలు, ఆర్వోఆర్, వన్ బి, ముటేషన్, రికార్డు రూము రిజిష్టర్లు, గ్రామ మ్యాప్, పెండింగ్ లో విన్న విచారణ ఫైల్స్, విచారణ పూర్తి అయిన ఫైల్స్, కుల ఆదాయ మొదలగు అన్నిరకాల సర్టిఫికేట్స్ లాంటి అన్ని రికార్డ్స్ ల ఒరిజినల్స్ జిరాక్స్ లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కింది స్థాయి అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.