- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరిక తీర్చాలంటూ బాలింత ఇంట్లో చొరబడిన వలంటీర్..
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో ఓ వలంటీర్ రెచ్చిపోయాడు. బాలింత అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాలింత భయంతో రోడ్డుపైకి పరుగులు తీసింది. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించిన ఆ వలంటీర్ అక్కడ నుంచి నెమ్మదిగా ఉడాయించాడు.
పిల్లుట్ల గ్రామంలో వివాహితపై వలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న బాలింతను కామవాంఛ తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో భయపడిన మహిళ బయటకు పరుగులు తీసింది. ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఎస్పీతోపాటు స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడారు. కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు గుంటూరు జిల్లా రాజీవ్‌గాంధీ నగర్‌లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపైనా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఆరా తీశారు.
సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై చర్యలకు వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఏలూరు సబ్ రిజిస్టార్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఘటనపై విచారణకు ఆదేశించాలని సూచించారు.