- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్మస్ సెలెబ్రేషన్స్..వ్లోగ్మాస్ షురూ!
దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ మొదలవుతాయి. క్రిస్మస్ ట్రీ కొనుక్కురావడం, గిఫ్ట్‌లు ప్యాక్ చేయడం, ఇళ్లంతా లైట్లతో అలంకరించడం.. ఇంకా ఎన్నో పనులుంటాయి. వాటితో పాటుగా గత రెండేళ్లుగా యూట్యూబర్స్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఒకటి ఉంది. అదే వ్లోగ్మాస్. అంటే వ్లోగ్ లేదా వీడియో బ్లాగ్‌లు చేసే యూట్యూబర్స్.. క్రిస్మస్ నెల అయిన డిసెంబర్ నెలలో ప్రతి రోజు ఒక వ్లోగ్ అప్‌లోడ్ చేయడమే ఈ ట్రెండ్‌లో భాగం. ఇప్పటికే డిసెంబర్ వచ్చేసింది కాబట్టి యూట్యూబ్‌లో వ్లోగ్మాస్‌లు షురూ అయ్యాయి.
పాపులర్ యూట్యూబర్, నటి, హోస్ట్, రైటర్ లిల్లీ సింగ్ కూడా వ్లోగ్మాస్ మొదలుపెట్టేసింది. తన మొదటి వ్లోగ్మాస్‌లో భాగంగా తన ‘లేట్ నైట్ విత్ లిల్లీ’ సెకండ్ సీజన్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. అనుకున్నది అనుకున్నట్లుగా చేయడంలో లిల్లీ ఎక్స్‌పర్ట్ కాబట్టి ఓ వైపు టీవీ షోను జనవరి 11న విడుదల చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే ఇటు తన కెరీర్‌కు బీజం వేసిన యూట్యూబ్‌లో వ్లోగ్మాస్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ వ్లోగ్మాస్‌లు చేయడం వల్ల లాభాలేంటి?
ప్రతిరోజు ఒక వీడియోను చానల్‌లో పెట్టడం వల్ల ఒక నిలకడత్వం ఏర్పడుతుంది. సబ్‌స్క్రైబర్లకు కూడా పెద్దగా బోర్ కొట్టదు. ఈ నెలరోజుల క్రమంలో వరుసగా వీడియోలు చేయడం వల్ల భవిష్యత్తులో చేయాల్సిన వీడియోల గురించి చాలా ఐడియాలు వస్తాయి. అలాగే సబ్‌స్క్రైబర్ల రీచ్ కూడా పెరుగుతుంది. అందుకే ఈ క్రిస్మస్ సీజన్‌ను వ్లోగర్లు ఒక అవకాశంగా తీసుకుని ప్రతి చిన్న విషయాన్ని వ్లోగ్ చేస్తుంటారు.
అయితే, వ్లోగ్మాస్ చేయాలంటే ముందు ఒక ప్రాసెస్ అవసరం. ముప్పై రోజుల్లో ఏ రోజున ఏం పెట్టాలని పక్కాగా ప్లాన్ చేసుకుని వ్లోగ్స్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఏది పడితే అది వ్లోగ్ చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు సరైన కాన్సెప్ట్ వ్లోగింగ్ చేసి 2020లో కనీసం ఈ డిసెంబర్ నెలనైనా సద్వినియోగం చేసుకోవడానికి వ్లోగర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.