- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్‌గా మారిన ఎమ్మెల్యే
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా అవతారమెత్తి విద్యార్థులకు లెక్కలు, సైన్స్, హిందీ పాఠాలను బోధించిన ఘటన ఆసక్తి రేపుతోంది. దీని వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సొంత నియోజకవర్గంలోని బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. అనంతరం విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేందుకు ఆయనే టీచర్‌గా మారి లెక్కలు, సైన్స్, హిందీ భాషలలో ఎలా సులువుగా పట్టు సాధించవచ్చే వివరించి అబ్బురపరిచారు. అనంతరం తాను చెప్పిన పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమయ్యాయో లేదో పరీక్షించారు. విద్యార్థులు సులువుగా సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించారు. విద్య ఒక్కటే జీవితాలను వృద్ధిలోకి తెస్తుందని ఆయన విద్యార్థులకు తెలియజెప్పారు. కాగా, గతంలో జోగారావు ప్రొఫెసర్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో సులువుగానే విద్యాబోధన ఆకట్టుకునేలా సాగించారు. ఎమ్మెల్యే ప్రయత్నాన్ని అంతా అభినందిస్తున్నారు.