- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌లో ‘విటమిన్ డి’ లోపం..
దిశ, వెబ్‌డెస్క్ : ‘విటమిన్ డి’ ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆరో తరగతి పిల్లవాడిని అడిగినా.. సూర్యుని నుంచి వస్తుందని టక్కున సమాధానం ఇస్తాడు. నిజానికి విటమిన్ డి నేరుగా సూర్యకాంతి నుంచి రాదు. శరీరంలో ఉన్న విటమిన్ డి ఉత్తేజితమై, బాగా పనిచేయడానికి మాత్రమే సూర్యకాంతి అవసరం. అయితే ఇప్పుడు రక్తపరీక్ష చేసుకున్న వారిలో చాలా మందికి విటమిన్ డి లోపం కనిపిస్తోందట. సూర్యుడు రోజూ వస్తున్నాడు, ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి బాగానే తింటున్నాం.. మరి విటమిన్ డి లోపం ఎందుకు వస్తుందని ఆశ్చర్యపోవద్దు. ఈ ఆశ్చర్యంలోనే సమాధానం ఉంది. అదేనండీ.. గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.. అదే ఈ విటమిన్ డి లోపానికి ప్రధాన సమస్య.
సాధారణంగా ఉదయం పూట ఎండ, సాయంత్రపు పూట ఎండ శరీరానికి తగిలినపుడు విటమిన్ డి బాగా దొరుకుతుంది. కానీ లాక్‌డౌన్ నాటి నుంచి నేటి వరకు పొద్దున్న సూర్యున్ని చూసిన రోజులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒకప్పుడు ఆఫీసుకు, స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండేది, ఎక్కడ ట్రాఫిక్ వల్ల లేటవుతుందోనన్న భయంతో పొద్దున్నే లేచి, రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు బయల్దేరేవాళ్లు. ఆ విధంగా ఎంతకొంత పొద్దటి ఎండ తగిలేది. ఇప్పుడు 9 గం.లకు ఆఫీసు అంటే, 8:55కు నిద్రలేస్తున్నారు. ఇక ఎండ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సాధారణ ప్రజలకు విటమిన్ డి లోపం ఉండటం వల్ల పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. కానీ అథ్లెట్లు, శారీరక శ్రమ చేసేవారికి విటమిన్ డి లోపం ఉంటే కండరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకని ఇంట్లో ఉన్నా సరే.. పొద్దున్నే ఒక పదినిమిషాలు ఎండకు నిలబడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.