కేకేఆర్ కోడ్ లాంగ్వేజీ వివాదం

by Shyam |
కేకేఆర్ కోడ్ లాంగ్వేజీ వివాదం
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వినోదంతో పాటు వివాదాలూ ఉంటాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమై 22 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వివాదం చోటు చేసుకుంది. సాధారణంగా బ్యాటింగ్ చేసే జట్టుకు కోచ్‌లు ఏవైనా సందేశాలు పంపాలంటే వాటర్స్ బాయ్స్‌గా ఉండే క్రికెటర్లతో పంపుతుంటారు. అయితే ప్రతీ సారి వారిని పంపి బ్యాట్స్‌మెన్‌కు సందేశం ఇవ్వడం కుదరదు. అంపైర్లు కూడా అందుకు ఒప్పుకోరు.

అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డగౌట్‌లో కోచింగ్ స్టాఫ్ 54 అనే కోడ్‌ను ప్రదర్శించింది. దీని ద్వారా ఏదో సందేశాన్ని బ్యాట్స్‌మెన్‌కు పంపుతున్నారని.. కేకేఆర్ క్రీడా స్పూర్తికి భిన్నంగా వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. కాగా, దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ‘ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పేరుతో ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి సమయంలో కోడ్‌ను వాడటం పెద్ద తప్పేం కాదు. అయినా మ్యాచ్ ముందు ఏదో చర్చించుకొన్న వ్యూహాల్లో ఒకటి అమలు చేయమని రాసుందేమో.. దానికి పెద్ద కంగారు పడాల్సిందేమీ లేదు’ అని సెహ్వాగ్ చెప్పాడు. మరోవైపు ఇలా బయటి నుంచి సహాయం చేస్తుంటే ఎవరైనా కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని సెహ్వాగ్ చురకలంటించాడు. ఏదేమైనా అలా డగౌట్‌లో కూర్చొని కోడ్ లాంగ్వేజ్ ఆడటంపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed