టీవీ యాడ్స్‌లో కోహ్లి హవా

by Shyam |
టీవీ యాడ్స్‌లో కోహ్లి హవా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ నేపథ్యంలో టీవీల్లో లైవ్ క్రికెట్ నిలిచిపోయింది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు లేకపోయినా టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ రికార్డు సృష్టించాడు. టామ్ రికార్డు ప్రకారం విరాట్ కోహ్లి నటించిన ప్రకటనలు అన్ని చానల్స్‌లో కలిపి 10 గంటలపాటు ప్రసారం అవుతున్నాయి. ఇందులో కోహ్లినే టాప్ ప్లేసులో ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్ (9 గంటలు), కరీనా కపూర్ (8 గంటలు) ఉన్నారు. ఏప్రిల్, జూన్ మధ్య ప్రసారాలకు సంబంధించిన టామ్ రేటింగ్స్ అనుగుణంగా ఈ నివేదిక రూపొందించారు. జంటల పరంగా కూడా కోహ్లి, అనుష్కలు మిగతా వాళ్ల కంటే ఎక్కువ సమయం టీవీల్లో కనిపిస్తున్నారు. వీరు 26శాతం కనిపిస్తుండగా అక్షయ్, ట్వింకిల్ జంట 19శాతం సమయం కనిపిస్తున్నారు. ఏదేమైనా టీమ్‌ఇండియా కెప్టెన్ ఈ ఏడాది లైవ్ క్రికెట్‌లో కనిపించింది తక్కువే అయినా ప్రకటన రూపంలో మాత్రం రోజూ దర్శనమిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed