- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన జడ్డూ, సిరాజ్, రిషబ్.. బీసీసీఐ వీడియో రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్ : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. సౌతాంప్టన్‌లో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌తో భారత ఆటగాళ్లు రెండు టీమ్స్‌గా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. ఈ ప్రాక్టిస్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలను బీసీసీఐ అధికారిక ట్విట్టర్లలో షేర్ చేసింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, శుభమన్ గిల్ బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. అలాగే బౌలర్లలో ఇషాంత్, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి సత్తా చాటుకున్నాడు.
The third day of intra-squad match simulation was about settling down & finding that rhythm. 👍 👍 #TeamIndia
Here's a brief recap 🎥 👇 pic.twitter.com/WByZoIxzT6
— BCCI (@BCCI) June 14, 2021
ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో కివీస్ ఘన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వస్తుందనడంతో సందేహం లేదు. జూన్ 18న భారత్, కివీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.