టాస్‌తోనే కోహ్లీ వరల్డ్ రికార్డు

by Anukaran |   ( Updated:2020-10-05 10:08:50.0  )
టాస్‌తోనే కోహ్లీ వరల్డ్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: పరుగుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్న ఇండియన్ కెప్టెన్ కోహ్లీ తాజాగా వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. సెంచరీలు.. పరుగులతో రికార్డులు బ్రేక్ చేసిన విరాట్.. చివరికి అత్యధికంగా T-20 సిరీస్‌లకు కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా కూడా రికార్డు బ్రేక్ చేశాడు.

కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోసం కోహ్లీ మొత్తంగా 197 మ్యాచుల్లో ఉన్నాడు. ఇది వరకు సోమర్‌సెట్‌ తరఫున ఆడిన జేమ్స్ హిల్డ్రెత్ 196 మ్యాచులు ఆడి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.. ఈ రోజు జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో కోహ్లీ జేమ్స్ హిల్డ్రెత్ రికార్డు అధిగమించాడు. దీంతో హిల్డ్రెత్ రెండో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఎంఎస్. ధోని, సమిత్ పటేల్ ఉన్నారు. సీఎస్కే తరఫున ధోని 189 ఆడగా.. నాటింగ్‌హమ్ షైర్ పక్షానా సమిత్ పటేల్ 189 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Next Story