చిరుతో చిందులేసేందుకు భారీగా డిమాండ్ చేసిన రష్మీ గౌతమ్

by Shyam |
reshmi and chiranjivi
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘భోళా శంకర్’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వస్తున్నాయి. తమిళ్ ఫిల్మ్ ‘వేదాళమ్’ రీమేక్‌గా వస్తున్న సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్‌ను తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చిరుతో చిందులేసేందుకు రెడీ అయిపోయిన భామ.. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటోందట. స్మాల్ స్క్రీన్‌పై తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న రష్మి.. ఈ ఒక్క పాట కోసమే రూ. 40 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. ఇందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుండగా.. రష్మి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. చిరు-రష్మి కాంబినేషన్‌లో సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed