- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమకు వయసెందుకు అంటున్న రాహుల్ దేవ్
దిశ, వెబ్‌డెస్క్:
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ప్రతినాయకుడి మంచి మంచి పాత్రలు చేసి మెప్పించిన రాహుల్ దేవ్ ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నారు. 51 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఓ నటితో ప్రేమలో పడ్డారు. ఆ నటి వయసు 33 ఏళ్లే. 2009లో భార్య రైనా కేన్సర్ కారణంగా చనిపోయిన తర్వాత, రాహుల్ పూర్తిగా కెరీర్ మీదే దృష్టి పెట్టారు. అప్పటికి 11 ఏళ్లు ఉన్న తమ కుమారుడు సిద్ధార్థ్ ఆలనాపాలనా చూసుకుంటూ సింగిల్ ఫాదర్‌గా ఉండిపోయాడు.
అయితే అప్పుడప్పుడూ ఫంక్షన్లలో కలిసిన నటితో ముందు స్నేహం చేశాడు. తర్వాత అది ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇంతకీ ఆ నటి పేరు చెప్పలేదు కదూ… ముగ్దా గాడ్సే. వారిద్దరి మధ్యా డేటింగ్ గురించి ప్రశ్నించినపుడు రాహుల్ చాలా ఆసక్తిగా స్పందించారు. ఆయన తల్లి, తండ్రి కంటే పదేళ్లు చిన్నదని, తన విషయంలో అది ఒక ఎనిమిదేళ్లు పెరిగిందని, ప్రేమ ఉన్న చోట వయసుతో సంబంధం లేదని ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఇలా ఎక్కువ వయస్సు భేదంతో ఒక్కటైన జంటలు చాలా ఉన్నాయంటూ రాహుల్ ఉదహరించారు.
tags: Rahul Dev, Mugdha Godse, Dating, Age Gap, Villain