- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double Bedroom Housing scheme : అనుమతులు లేకున్నా.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి గ్రామస్తుల గృహ ప్రవేశాలు
దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండంలోని పోలేనిగూడెంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళల్లో.. గ్రామానికి చెందిన కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఆదివారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. వివరాల ప్రకారం.. పోలేనిగూడెం గ్రామంలో ఇళ్లు లేని పేదల కోసం గ్రామ శివారులో 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ ఇళ్ల నిర్మాణం పూరై మూడేళ్ళు గడిచినా, వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ వాటిని పంచాయతీ రాజ్‌శాఖకు అప్పగించలేదు.
దీనితో పాటు ఇళ్ల వద్ద మిగిలిన మౌలిక సదుపాయాలైన డ్రైనేజీలు, మంచి నీటి వసతిని ఇంకా కల్పించలేదు. మౌలిక వసతులు లేకపోవడంతో దీని కేటాయింపునకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. కానీ నిర్మాణం పూరై.. ఇంకా ప్రభుత్వం వాటిని కేటాయించకపోవడంతో.. ఆదివారం గ్రామానికి చెందిన కొందరు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ తాళాలు పగులగొట్టి ఆ ఇండ్లలోకి ప్రవేశించి, గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇళ్లల్లో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయారు.
సోమవారం ఉదయం ఈ సమాచారం తెలుసుకున్న చిలుకూరు తహసీల్దార్ రాజేశ్వరి, పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. ఇండ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అవి పూరై, మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేస్తామని, ప్రస్తుతానికి వాటిని ఖాళీ చేసి వెళ్ళాలని కోరారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు పడితే తమ ఇళ్ళు కూలిపోతాయని, ఇంకా ఎంతకాలం ఉండాలని వారు అధికారులను ప్రశ్నించారు.
అనుమతి లేకుండా ఇళ్ళను ఆక్రమిస్తే ప్రభుత్వ పథకాలు వర్తించవని అధికారులు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఇళ్ల కేటాయింపు చేసేవరకు తాము అక్కడి నుండి కదలబోమని చెప్పారు. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, పోలీస్ అధికారులు తెలిపారు.