- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణి అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: సాంకేతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నా.. దేశంలో అక్కడకక్కడ ఇప్పటికీ మూడనమ్మకాల పేరుతో అనాగరిక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటే ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఓ గర్భిణి డెలివరీ కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే ప్రసవం సమయంలో మృతి చెందింది. దీంతో ఆమె బంధవులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని నాగిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. అయితే కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేస్తే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో బంధువులు గర్భిణి మృతదేహాన్ని సమీపంలోని అడవిలో చెట్టుకు కట్టేశారు. ఈ సమాచారం కాస్త పోలీసులకు తెలియడంతో తిరిగి గర్భిణి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Advertisement
Next Story