విద్యుత్ షాక్‌తో పామును చంపిన గ్రామస్తులు

by Shyam |
విద్యుత్ షాక్‌తో పామును చంపిన గ్రామస్తులు
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం వైకుంఠపురం గ్రామంలో సోమవారం నాగుపాముకు కరెంటు షాక్ ఇచ్చి చంపిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పరుశురామయ్య అనే వ్యక్తి పాము కాటుకు గురయ్యారు. ఇంటిలో ఉన్న సన్సైడ్ పైన ఉన్న తాళం చెవిని తీస్తుంటే పాము కోడి గుడ్ల కోసం వచ్చి కాటు వేసింది. వెంటనే అతడిని స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. కాటు వేసిన పామును స్థానికులు కరెంటు షాక్ పెట్టి చంపేశారు.

Advertisement

Next Story

Most Viewed