- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గతంలో గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు శ్రీమతి డీకే అరుణ సమక్షంలో విక్రమ్ గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నాడు. అనంతరం ఈ సందర్భంగా డికె. అరుణ మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.
Next Story