RRR లో కొమురం భీమ్ ముస్లిం టోపీ.. ఎందుకో తెలుసా?

by Shyam |   ( Updated:2021-07-21 07:20:06.0  )
RRR లో కొమురం భీమ్ ముస్లిం టోపీ.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా : మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ ప్లే చేస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించి రివీల్ అయిన ఫస్ట్ లుక్ టీజర్‌లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించడంపై కొమురం భీమ్ వారసుల నుంచి విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇష్యూపై డైరెక్టర్ గానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘కొమురం భీమ్‌ను నిజాం సైన్యం వెంటాడుతున్న సమయంలో వారి కళ్లుగప్పి తప్పించుకునేందుకు ముస్లిం వేషం ధరిస్తాడు’ అని రివీల్ చేశారు. కాగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అద్దె గర్భానికి ఓకే చెప్పిన హీరోయిన్

Advertisement

Next Story

Most Viewed