- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చేవారం నుంచే చెన్నైకు విమానం..
దిశ, ఏపీ బ్యూరో: కరోనా కారణంగా ఏపీలోని విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి 4 నెలలుగా చెన్నైకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఈనెల రెండోవారం నుంచి ఓ సర్వీస్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దానిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కూడా ఆచరణలో పెట్టింది. దీంతో విజయవాడ – చెన్నై విమాన సర్వీసులకు రాకపోకలకు రంగం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే ఈనెల 8న చెన్నైకు తొలి విమానం నడవనున్నది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి 9 విమాన సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరుకు నాలుగు, హైదరాబాద్‌కు నాలుగు, వారంలో రెండురోజుల పాటు ఢిల్లీకి ఒక విమానం నడుస్తోంది. తాజాగా చెన్నైతో పాటు హైదరాబాద్‌కు చెరో విమాన సర్వీసు రాకపోకలకు అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య 11కు చేరుకుంది.