- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్బా సాయిరాం నాకు చాలా సంతోషంగా ఉంది
దిశ,వెబ్‌డెస్క్: ఏం సీఎం పదవికి నేను పనికి రానా..? దిగిపొమ్మంటారా? పార్టీ లైన్ తెలుసుకుకోకుండా మాట్లాడితే కర్రుకాల్చి వాత పెట్టాల్సి వస్తుంది. అయినా నేను ముందే అసెంబ్లీలో స్పీకర్‌గారికే చెప్పిన. నాకేమైంది.. దుక్కిలెక్క ఉన్న.. ఇంకో పదేండ్లు నేనే సీఎంగా ఉంటానని చెప్పా అనవసర విషయాల గురించి ఎక్కువ మాట్లాడకండి అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు.
”సీఎం గారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం. వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైంది. ఈ అధికార పార్టీ పిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయి. అయితే, సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటున్నారు. ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అంటే, మబ్బుల మాటున ఉండే వానా కాలపు సూర్యుడిలా…. మరో పదేళ్ళ పాటు ఎప్పుడు ప్రగతి భవన్‌లో కనిపిస్తాడో… ఎప్పుడు ఫాం హౌస్‌లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనం తననే భరించాలని హెచ్చరిస్తున్నట్టుంది.అయితే, సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ…. ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని” విజయ శాంతి ట్వీట్ చేశారు.