- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం, సీఎంలు కూడా పాటించాలి : విజయశాంతి
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై స్పందించారు.
కరోనా విషయమై ఇప్పటికే ప్రజలలో చాలా వరకూ అవగాహన ఏర్పరిచే దిశగా ప్రభుత్వాలు సఫలమవుతున్నాయని… పోలీసు, వైద్య మరియు సంబంధిత ఇతర అధికారులు కూడా మాస్క్‌లు ధరిస్తూ, దూరం పాటిస్తూ, నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్నారన్నారు.
అయితే, ప్రెస్‌మీట్‌ల సందర్భంగా ప్రధానమంత్రిగారు, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఇంకా ముఖ్యనేతలు మాస్క్ నిబంధనలు పాటించకుండా ఉంటున్నారని …. ఎక్కువ సంఖ్యలో ఒకేచోట గుమిగూడిన తెలంగాణ సీఎం కేసిఆర్ మీడియా సమావేశాలు టీవీల్లో రావడం వల్ల…
కరోనా అంత ప్రమాదకరం కాదేమో… లేకపోతే సీఎం ఎందుకంత అజాగ్రత్తగా ఉంటారు? అన్న భావంతో రోడ్లపైకి ఇంకా కొందరు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ జాగ్రత్త కూడా ప్రజలకు వెళ్ళే సంకేతాల దృష్ట్యా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు..
అలాగే, ఇంత సహకరిస్తున్న ప్రజలపై, దాష్టీకం చూపకుండా ప్రభుత్వం కూడా అధికారులను నిర్దేశించాలని కోరారు.. ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో తీవ్రమైన వైఖరిని ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నది వాస్తవమే అయినా… అవతలి ప్రజలు కూడా నేరస్తులు కాదన్నది అర్థం చేసుకోవాలని కోరారు విజయశాంతి.
Tags: Vijaya Shanthi, Congress, CoronaVirus, Covid19