- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50% కాదు.. 100% ఆడియన్స్ కెపాసిటీకి పర్మిషన్?
దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా రికార్డులు క్రియేట్ చేయగా.. ‘మాస్టర్’ U/A సెన్సార్ సర్టిఫికెట్ పొందిందని ఈ మధ్యే ప్రకటించింది మూవీ యూనిట్. సంక్రాంతికి విడుదల కానున్న సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ జనవరి 7 నుంచే మొదలవుతుందని తెలుస్తుండగా.. కేవలం యాభై శాతం యాక్యుపెన్సీతో లాభాలు కష్టం కాబట్టి వందశాతం ఆడియన్స్ కెపాసిటీకి అనుమతించాలని కోరినట్టుగా టాక్. ఈ క్రమంలోనే హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని కలిశారని సమాచారం. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ వార్తతో విజయ్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
కాగా ‘మాస్టర్’ ఫిల్మ్ మేకర్స్ హిందీ, తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా.. హిందీలో టీజర్, కుట్టి స్టోరీ తెలుగు వెర్షన్ సాంగ్ విడుదల చేశారు. విజయ్, విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ కాగా లోకేష్ కనగరాజ్ దర్శకులు.