విజయ్ మాల్యా పైసలిస్తడటా కానీ..కండిషన్స్ అప్లై!

by Harish |   ( Updated:2020-05-14 03:18:35.0  )
విజయ్ మాల్యా పైసలిస్తడటా కానీ..కండిషన్స్  అప్లై!
X

దిశ, వెబ్‌డెస్క్:
ఇండియాలోని పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం ఎగవేత విషయంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తాను తీసుకున్న రుణాలను వంద శాతం చెల్లిస్తానని కానీ, తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ బాగుందని కితాబిచ్చిన మాల్యా..తన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ బ్యాంకుల్లో తాను పొందిన రుణ బకాయిలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని, డబ్బు తీసుకుని నాపై ఉన్న కేసులను కొట్టి వేయాలని కేంద్రానికి షరతు విధించాడు. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణాలను పొంది, వాటిని చెల్లించలేక 2016లో మాల్యా దేశం వదిలి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన్ను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రయత్నం చేస్తోంది. తనను భారత్‌‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా బ్రిటన్ కోర్టులో వేసిన అప్పీల్‌ని ఆ కోర్టు కొట్టివేసింది.ఈ క్రమంలోనే ఆయన ఆ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Advertisement

Next Story