ఆర్టీఏ ఆఫీసులో పార్కింగ్ వసూళ్లేంటి.. మంత్రిపై నెటిజన్ల ఆగ్రహం

by Shyam |
Vijay Gopal, social activist, minister puvvada
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాహనాదారులను వెంటాడుతోన్న పార్కింగ్ సమస్యపై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఎక్కడికక్కడ పార్కింగ్ పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు. గతకొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కారు పార్కింగ్‌లో ఉంచడంతో 31 నిమిషాలకు రూ.500 వసూలు చేశారు. దీనిపై వాహనదారులు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఓ నెటిజన్ అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలోనూ పార్కింగ్ వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ స్పందిస్తూ మంత్రి పువ్వాడ అజయ్‌ను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. ‘‘This is ridiculous @TSRTAIndia @puvvada_ajay why do you people do such things and only keep looting people ?! Why? How will people come if govt. authorities start taking illegally all such charges. Already ur website itself is illegal with illegal charges for online applications’’ అని ట్వీట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం.. ప్రజల నుంచి ఎందుకు ఇలా దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే వెబ్సైట్ ద్వారా ఇల్లీగల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విజయ్ గోపాల్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed