రౌడీ హీరో రియాలిటీ షో..

by Anukaran |   ( Updated:2020-07-08 04:07:27.0  )
రౌడీ హీరో రియాలిటీ షో..
X

బిగ్ బాస్ రియాలిటీ షో.. కంటెస్టెంట్లకు కొత్త లైఫ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న చాలా మంది.. ప్రస్తుతం సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ.. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్‌కు ఎంటర్ అయితే కెరియర్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది టాక్. అందుకే ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

ఇక హోస్ట్‌ల విషయానికొస్తే.. దాదాపు హీరోలు మాత్రమే హోస్ట్‌గా వ్యవహరిస్తారు. తెలుగు బిగ్ బాద్ ఫస్ట్ సీజన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్.. యాంకరింగ్ ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇంటి సభ్యులకు ఎవరికి ఎలా తప్పొప్పులు చెప్పాలి.. ఎవరిని ఎలా అప్రిషియేట్ చేయాలి.. ఎవరిని ఎలా మందలించాలి.. అనేది సరిగ్గా చెప్పాడు. ఆ తర్వాత సీజన్‌లో నాని.. మూడో సీజన్‌లో కింగ్ నాగార్జున కూడా హోస్ట్‌గా సూపర్ అనిపించుకున్నారు. కాగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. తారక్, నాని, నాగ్‌లో ఎవరో ఒకరు హోస్ట్‌గా ఉంటారని ముందుగా వార్తలు వచ్చినా.. ఆ తర్వాత అక్కినేని వారి కోడలు సమంత పేరు వినిపించింది. కానీ తను కాదని ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ అయింది. దీంతో ప్రస్తుతం మరో పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెరపై నీరాజనాలు అందుకున్న భారీ షో బిగ్ బాస్ తెలుగు ఫోర్త్ సీజన్‌కు రౌడీ హీరో హోస్ట్‌గా వచ్చే చాన్స్ ఉందని సమాచారం. ప్రజెంట్ జనరేషన్‌కు దగ్గరైన విజయ్.. ఈ షో చేస్తాడని, మంచి టీఆర్పీ రేటింగ్‌తో షో నడిపిస్తాడని టాక్.

కానీ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌గా వస్తున్న ఫైటర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్.. కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్‌లోనే పాల్గొనడం లేదు. మరి ఈ రియాలిటీ షో షూటింగ్‌కు వస్తాడా?. టైమ్ ఉంటే ముందు సినిమా కంప్లీట్ చేస్తాడు తప్ప.. రియాలిటీ షో అంటూ టైమ్ వేస్ట్ చేస్తాడా? అనేది మరి కొందరి మాట.

Advertisement

Next Story

Most Viewed