- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
– వినోద్ కుమార్‌తో ఫోన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రశంసించారు. కరోనా వైరస్‌ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తదనంతర పరిస్థితులపై వెంకయ్య ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు వెంకయ్య ఫోన్ చేసి, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలను వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా చేస్తున్న నిత్యావసర వస్తువుల పంపిణీ, భోజన వసతి విషయాన్ని ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వివరించారు. లాక్ డౌన్‌ను కూడా పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని వినోద్‌కుమార్ ప్రస్తావించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్‌కు తెలిపారు.
Tags: venkaiah naidu, cm kcr, vinod kumar, corona, telangana