గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి

by Shyam |
గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హిందువుల మనో భావాలను గౌరవిస్తూ వినాయక నవరాత్రి ఉత్సవాలకు, నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం కోఠిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ నాయకులు రామరాజు, సురేందర్ రెడ్డి, రమేష్, సుభాష్ చందర్‌లు మాట్లాడుతూ…

గత కొన్ని రోజులుగా నల్గొండ, వరంగల్, గద్వాల్ తదితర ప్రాంతాల్లో ఉత్సవ నిర్వాహకులను గ్రామానికి ఒక్క విగ్రహమే ప్రతిష్టించాలని పోలీసులు వేధిస్తున్నట్టు తెలిపారు. ఇది ఏ మాత్రం అమోదయోగ్యం కాదన్నారు. పోలీసులతో ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని చూడడం సరికాదన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వినాయక నవరాత్రులు జరుపుకోవాలని, అంతేకాకుండా సామూహిక నిమజ్జనం, సామూహిక ప్రార్ధనలు చేయరాదని, విగ్రహాల ఎత్తును సాంప్రదాయ బద్ధంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed