పెళ్లిళ్లు చేయం..కానీ ప్రేమకు వ్యతిరేకం

by Shamantha N |
పెళ్లిళ్లు చేయం..కానీ ప్రేమకు వ్యతిరేకం
X

ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమ జంటలకు ఇకమీదట బలవంతంగా పెళ్లిళ్లు చేయబోమని వీహెచ్‌పీ, బజరంగ‌దళ్ నాయకులు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 14న పార్క్‌లు, పబ్‌ల వద్ద అమరవీరుల ఫ్లెక్సీలు పెడతామని అందులో పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ ప్రేమికులు కనిపించినా పెళ్లిళ్లు జరపించబోమని, అమరవీరులకు నివాళులర్పించేలా వారికి వివరిస్తామని తెలిపారు. ఈ మేరకు పార్క్‌‌లు, పబ్‌లకు ఇప్పటికే లేఖలు పంపిణీ చేసినట్టు వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed