- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిల్కాసింగ్‌కు కొవిడ్
దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కొవిడ్ బారిన పడ్డారు. బుధవారం ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. 91 ఏళ్ల మిల్కాసింగ్ ప్రస్తుతం చండీఘడ్‌లోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిల్కాసింగ్ ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోలేదని.. ఇటీవల ఒక పని అబ్బాయికి కరోనా పాజిటివ్ రావడంతో మిల్కాసింగ్ కూడా పరీక్షలు చేసుకోగా కరోనా అని తేలినట్లు అతడి భార్య నర్మల్ కౌర్ తెలిపారు. మిల్కాసింగ్ కూతురు ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నది. ఆమె అక్కడి నుంచి తండ్రికి వీడియోకాల్ ద్వారా వైద్యం చేస్తున్నట్లు నిర్మల్ కౌర్ తెలిపారు.
కాగా, మిల్కాసింగ్‌కు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని ప్రస్తుతం స్మెల్, టేస్ట్ తెలుస్తున్నాయని స్వయంగా ఆయనే తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా స్థానిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అతని కోసం ఒక సహాయకుడితో పాటు ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అందుబాటులో పెట్టింది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడు కూడా మిల్కా సింగే. భారత ప్రభుత్వం మిల్కాసింగ్‌ను పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.