- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రముఖ నటుడు కన్నుమూత
by Shyam |
X
దిశ, సినిమా: వెటరన్ యాక్టర్ చంద్రశేఖర్ వైద్య(98) కన్నుమూశారు. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్‌తో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జ్వరం కారణంగా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇంట్లో కోలుకుంటున్నారనుకునే సమయంలో ఇలా జరిగిందని తెలిపాడు నటుడు, మనవడు శక్తి అరోరా. పాపులర్ టీవీ సీరియల్ రామాయణ్(1987)తో ఆర్య సుమంత్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఆయన.. 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించారు. రాజేష్ ఖన్నా చిత్రాల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా ఫేమ్ సంపాదించిన చంద్రశేఖర్ వైద్య.. 250కిపైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సురంగ్, ఛ ఛ ఛ, కోషిష్, ఆంధీ, మౌసమ్ లాంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆయన మరణవార్త విన్న ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Advertisement
Next Story