- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ సర్వే.. బయటపెట్టిన మంత్రి వేముల
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలని కోరితే.. అన్ని రోజులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని శాసనసభ, మండలి వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ లాంజ్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీజేపీని బీఏసీకి పిలవాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు. చర్చకు తాము 10 అంశాలు స్పీకర్ కు ఇచ్చామని, అందులో ఐటీ పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయం, దళిత బంధు లాంటివి ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశాలకు నాలుగు లేదా ఐదు బిల్లులు ఉంటాయని, రెండు ఆర్డినెన్స్ స్థానంలో పాస్ చేసేవి ఉన్నట్లు తెలిపారు.
ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం చర్చించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలు ఇచ్చిందని, ఎనిమిది అంశాలు చెప్పారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ శాసనసభ సమావేశాలు బాగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. తమ సర్వే ప్రకారం హుజురాబాద్‌లో బీజేపీ కన్నా 15 శాతం ఎక్కువ ఓట్లు టీఆర్‌ఎస్ సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.