పెళ్లి చేసుకున్న వరుణ్ చక్రవర్తి

by Shyam |
పెళ్లి చేసుకున్న వరుణ్ చక్రవర్తి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కాగా, వరుణ్ చక్రవర్తిగానీ అతని కుటుంబం కానీ ఈ వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వరుణ్ స్నేహితుడు అరుణ్ కార్తీక్ వీరి పెళ్లి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. తన చిన్ననాటి స్నేహితురాలినే చెన్నైలో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అరుణ్ కార్తీక్ చేసిన పోస్టుకు అనేక మంది అభిమానులు లైక్స్ కొట్టారు. టీమ్ ఇండియా బౌలర్ నటరాజన్ కూడా ఈ పోస్టును లైక్ చేశాడు. కాగా, టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన వరుణ్ గాయం కారణంగా అక్కడకు వెళ్లలేకపోయాడు. వరుణ్ స్థానంలోనే బీసీసీఐ టి. నటరాజన్‌ను ఎంపిక చేసింది.

Advertisement

Next Story

Most Viewed