- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. రూ. 99కే అన్‌లిమిటెడ్ బిర్యానీ..
దిశ, ఫీచర్స్: సాధారణంగా బిర్యానీ అనగానే లొట్టలేసుకుంటూ తినేవారు 99 శాతం మంది ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికైతే ప్రతి రోజూ బిర్యానీ తిన్న బోర్ కొట్టదు. అలాంటి బిర్యానీ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్. హైదరాబాదులోని అమీర్‌పేట్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఉన్న హోటల్‌లో అన్‌లిమిటెడ్ బిర్యానీ ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 99 కే మీకు చికెన్ బిర్యానీ వస్తుంది. బిర్యానీలో సగం గుడ్డు పెడతారు. ఒక చికెన్ పీస్ వస్తుంది. అన్‌లిమిటెడ్‌గా బిర్యానీ తినొచ్చు. కానీ కేవలం బిర్యానీ రైస్ మాత్రమే పెడతారు.. పీసెస్ మాత్రం ఇవ్వరు.
అయితే ఇక్కడ అన్‌లిమిటెడ్ బిర్యానీ అయినా కూడా ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోండి. అన్‌లిమిటెడ్ కదా అని.. ఫుడ్ వేస్ట్ చేస్తే మాత్రం రూ. 200 ఫైన్ పడుతుంది. ఎంత తిన్నా పెడతారు. కానీ బిర్యానీ వేస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందే. అలాగే ఇక్కడ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఉంటుంది. దీని రేటు కూడా రూ. 99 మాత్రమే. ఇంకా ఎగ్ బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 79 మాత్రమే. కాకపోతే ఈ ఆఫర్ కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉంటుంది.