- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ పెట్టని కొడుకు.. గుంజీలు తీసిన తండ్రి
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంతమంది వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్క్ పెట్టుకోనివారికి రూ.1000 ఫైన్ వేసినా పలు చోట్ల మాస్క్ లు లేకుండా తిరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక అధికారులు సైతం మాస్క్ పెట్టుకోనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కొడుకు మాస్క్ పెట్టుకోలేదని తండ్రి చేత గుంజీలు తీయించిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలోని అధికారులు మాస్క్ పెట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తహసీల్దారు సింధూజ రోడ్డుపై మాస్క్ పెట్టుకొని వారిని గుర్తించి వారికి కఠిన శిక్షలు విధించారు. ఒక బైకుపై వెళ్తున్న తండ్రికొడుకుల్లో కొడుకు మాస్క్ పెట్టుకోకపోవడం గమనించిన ఆమె వారిని పిలిచి కొడుకు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగింది. అందుకు అతను ఏం సమాధానం చెప్పకపోవడంతో తండ్రి మాస్క్ ను కొడుకుకు పెట్టించి తండ్రి చేత 100 గుంజీలు తీయించింది. ఇంకెప్పుడు మాస్క్ లేకుండా బయటకు రాకూడదని హెచ్చరించింది. చిన్న పిల్లలే ఎక్కువ కరోనా బారిన పడుతున్నారని, వారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు మాస్క్ పెట్టి తీసుకురావాలని సూచించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ విధించమంది కానీ .. ఇలా శిక్షలు వేయమనలేదు అంటూ అక్కడివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.