వకీల్ సాబ్‌కు లీక్ కష్టాలు..

by Jakkula Samataha |
వకీల్ సాబ్‌కు లీక్ కష్టాలు..
X

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కమింగ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్. ఫస్ట్ లుక్‌తోనే అభిమానులకు కిక్ ఇచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ మూవీ పింక్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి దిల్ రాజ్, బోనీ కపూర్ నిర్మాతలు.

అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి నిర్మాతలు నష్టపోతుంటే.. మరోవైపు సినిమా ప్రారంభం నుంచి లీక్‌ల సమస్య వెంటాడుతోంది. షూటింగ్ తొలి రోజునే పవన్ లుక్ బయటకు రాగా.. తాజాగా సినిమాకు కీలకమైన కోర్టు సీన్ పిక్చర్ నెట్టింట వైరల్ అయింది. లాయర్ గెటప్‌లో పవన్ కేసు వాదిస్తుండగా.. తన క్లయింట్ పాత్ర చేస్తున్న అంజలి కూడా ఈ ఫొటోలో కనిపిస్తోంది.

Advertisement

Next Story