ఈదురు గాలుల బీభత్సం.. విరిగిన కరెంటు స్తంభాలు.. బోల్తా పడిన రేకుల డబ్బాలు

by Kalyani |
ఈదురు గాలుల బీభత్సం.. విరిగిన కరెంటు స్తంభాలు.. బోల్తా పడిన రేకుల డబ్బాలు
X

దిశ, కొల్చారం: మండలంలోని పోతంశెట్టిపల్లి ఏడుపాయల టీ జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసుకున్న హోటల్లు, తినుబండారాల దుకాణాల రేకుల డబ్బాలు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. దుకాణాలు హోటల్లో ముందు పోతంశెట్టిపల్లి వైన్స్ ముందు నిలిపించిన కార్లపై విద్యుత్ స్తంభాలు పడడంతో కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలుల వర్షానికి కొల్చారం మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టీ జంక్షన్ సమీపంలోని ఆర్ఆర్ హోటల్, హర్షిత హోటల్ దుర్గ భవాని హోటల్ సమీపంలో రేకుల షెడ్డులు పూర్తిగా ఈదురుగాళ్లకు ఎగిరిపోయాయి. అకాల వర్షానికి ఈదురుగాళ్ల కారణంగా నష్టపోయిన చిన్న చిన్న వ్యాపారులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Next Story