‘ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ సాధ్యమే’

by Harish |
‘ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ సాధ్యమే’
X

లండన్: ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ ఈ ఏడాది చివరికల్లా టీకా తీసుకురావడం సాధ్యమేనని ఆస్ట్రా జెనెకా ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ ఏడాదిచివరికి లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి తీసుకురావడం అసాధ్యమేమీ కాదని వెల్లడించింది. యూకేలో ట్రయల్స్ నిర్వహిస్తుండగా ఓ టీకా ఇచ్చిన పార్టిసిపెంట్‌లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తింది.

దీంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించనున్నట్టు పేర్కొంది. ఈ కమిటీ సూచనల మేరకే ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ మళ్లీ ప్రారంభించడం ఉంటుందని, కాబట్టి త్వరలోనే మళ్లీ ట్రయల్స్ ప్రారంభించే అవకాశమున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story