- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Tragedy: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

దిశ, వెబ్‌డెస్క్: బీటెక్ విద్యార్థిని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District) జిల్లా చిలుకూరు (Chilukur)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా (Manchryala District), జైపూర్ మండల పరిధిలోని పగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి (Krishnaveni) చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల (GATE Engineering College)లో చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున కృష్ణవేణి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉగాది (Ugadi)కి ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం కళాశాలకు వచ్చింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్‌ల్లోనే గడిపింది. అనంతరం తెల్లవారుజామున తల్లి రూంలో ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.