- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాన్ పహాడ్ దర్గాకు వచ్చి తిరిగి వెళ్తున్న కారు.. అంతలోనే!

దిశ, గరిడేపల్లి : కారు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కమలాపురానికి చెందిన కొందరు కారులో జాన్ పహాడ్ దర్గాకు వచ్చి దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో అప్పన్నపేట గ్రామ శివారులోని క్రషర్ మిల్లుల వద్దకు చేరుకునే సరికి హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో గుర్తు తెలియని ద్విచక్ర వాహదారుడు తీవ్రంగా గాయపడటంతో గమనించిన స్థానికులు వెంటనే 108 లో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిజిహెచ్ కి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతదేహాన్ని కోదాడ ఆస్పత్రిలోని మార్చురీ లో ఉంచారు. ఇదే విషయమై పోలీసులను వివరణ అడగగా మృతుని ఆచూకీ లభ్యం కాలేదనీ, మృతుడు కోత మిషన్ లకు సంబంధించిన యువకుడు కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.