వ్యాక్సినేషన్ రూల్స్ బ్రేక్.. ఒకే నెలలో బోధన్ ఎమ్మెల్యేకు రెండు డోసులు

by Shyam |   ( Updated:2021-06-22 11:00:05.0  )
bodan-mla-shakeel
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నెల రోజుల్లోనే కొవిడ్ టీకా ఫస్ట్, రెండవ డోసులు తీసుకోవడం ప్రస్తుతం అసాధ్యం. అందుకు కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు ఎక్కువ వెలుగు చూడటమే కారణం. వ్యాక్సిన్ కొరత ఓ సమస్య అయితే, డోసుల మధ్య ప్రభుత్వం విధించిన కాల పరిమితి అందుకు మరో రీజన్. అయితే, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకిల్ ఆమేర్ నెల వ్యవధిలోనే రెండవ డోసు టీకాను మంగళవారం వేసుకోవడం కలకలం రేపింది. బోధన్ జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే షకిల్ ఆమేర్ వ్యాక్సినేషన్ వేయించుకున్న ఫోటోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

గత నెల 29న మొదటి డోసు వేసుకున్న ఎమ్మెల్యే, కనీసం 45 రోజుల గ్యాప్ లేకుండా ఏ విధంగా సెకండ్ డోస్ వేసుకున్నాడు. ఎమ్మెల్యేకు ఓ రూల్ సామాన్యులకు మరో రూల్ అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సామాన్యులకు, బోధన్ వాసులకు కూడా టీకాను 25 రోజుల్లోనే వేయాలంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కామెంట్ల యుద్ధం నడుస్తోంది. అయితే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాల నరేంద్రకు ఎమ్మెల్యే షకిల్ ఆమేర్‌కు రెండవ డోసు వ్యాక్సినేషన్ గురించి తెలియదని సమాచారం. ఆస్పత్రి వైద్యులే జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇవ్వకుండా మ్యాటర్ మొత్తం నడిపినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed