- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
45 ఏళ్లు దాటిన వారికి టీకా…
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీ వేగవంతం చేసింది. ఏప్రిల్1 నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వైద్యశాఖ లెక్క ప్రకారం రాష్ట్రంలో 45ఏళ్లు నిండిన వారు 94లక్షల మంది ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 టీకా సెంటర్లను ఏర్పాటు చేసి అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందించనున్నారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు 100 మంది వరకు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. జులై 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,51,223 మంది టీకాను వేయించుకున్నారు.
టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ముందుగా వృద్దులకు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు అందించాలని నిర్ణయించింది. టీకా కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారందరికీ విడుతల వారిగా అందించారు. టీకాను వేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతులిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాను అందించగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.250 రుసుముతో టీకాను అందించారు. మొదటి దశ టీకా వేయించుకున్న వారందరూ 28 రోజుల తరువాత రెండో దశ టీకాను వేయించుకోవాలని సూచించారు. టీకాను రెండు దశల్లో తీసుకున్న వారిలో చాలా వరకు కరోనా వ్యాధిని నియంత్రించగలిగే ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందినట్టుగా వైద్యులు గుర్తించారు.
టీకాను తీసుకున్న 9,51,223 మంది..
కరోనా టీకాను రాష్ట్రంలో జనవరి 16 నుంచి ప్రారంభించగా ఇప్పటి వరకు మొత్తం 9,51,223 మందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాను అందించారు. వీరిలో రెండవ డోసు టీకాను 2,34,548 మంది తీసుకున్నారు. రాష్ట్రంలో టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత తొలిసారి హెల్త్ కేర్ వర్కర్లకు టీకాను అందించారు. వీరిలో 2,24,054 మందికి మొదటి డోసు టీకాను అందించగా రెండవ డోసును 1,69,679 మందికి అందించారు. తరువాత ఫ్రంట్ లైన్ వర్కలైన రెవెన్యూ, పోలీసు సిబ్బందికి టీకాను అందించారు, వీరిలో మొదటి డోసు టీకాను 1,14,039 మంది తీసుకోగా, రెండవ డోసు టీకాను 64, 869 మంది తీసుకున్నారు. తరువాత 60ఏళ్ళు పైగా బడిన వృద్దుల్లో మొదటి డోసు 4,02,204 మంది టీకాను తీసుకోగా 45ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 2,10,926 మంది టీకాను వేయించుకున్నారు. గడిచిన 24గంటల్లో మొదటి విడుత టీకాను 12,564 మంది తీసుకోగా రెండవ విడుత టీకాను 40 మంది తీసుకున్నారు.
45ఏళ్లు దాటిన వారు 94లక్షల మంది..
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన 94 లక్షల మందికి టీకాను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో ఇది వరకే ప్రభుత్వం గుర్తించిన 60 ఏళ్ల పైబడిన వృద్దులు 54లక్షల వరకు ఉండగా 45ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 10 లక్షల మంది, మొత్తం 64 లక్షల మంది ఉన్నారు. వారికి తోడుగా తాజాగా మరో 30 లక్షల మందికి టీకాను వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లో 6,13,130 మంది టీకాను పొంది ఉన్నారు. ఇంకా మిగిలిన 87,86,870 మందికి టీకాను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
రాష్ట్రంలో 2000 టీకా కేంద్రాలు..
ప్రభుత్వం ప్రకటించిన అర్హులందరికీ టీకాను అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2000 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాను అందించనుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.250 రుసుము చెల్లించి టీకా వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్‌లో రోజుకు100 మంది వరకు టీకాను అందిచేలా ఏర్పాట్లను చేపట్టారు. జులై 31 నాటికి 45ఏళ్లు నిండిన అందరికీ టీకాను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్యశాఖ లెక్క ప్రకారం.. అన్ని టీకా సెంటర్లలో రోజుకు 100 మందికి చొప్పున 2000 సెంటర్ల ద్వారా 2లక్షల మందికి టీకాను అందించవచ్చు. ఈ లెక్కన 44 రోజుల్లో 45 ఏళ్లు దాటిన వారందరికి టీకాలు అందించే అవకాశం ఉంది.