- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో వ్యాక్సినేషన్.. తల్లిదండ్రులకు కూడా..
దిశ, శేరిలింగంపల్లి: కళాశాలలో చదువే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలనేదే తమ ఉద్దేశ్యమని అవినాష్ కాలేజీ ఆఫ్ కామర్స్ సంస్థ చైర్మన్ అవినాష్ బ్రహ్మదేవర. అందుకుగాను విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా కోవిడ్ టీకా వేయిస్తున్నట్లు తెలిపారు. వివేకానంద నగర్ డివిజన్ లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో కూకట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అవినాష్ బ్రహ్మదేవర మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, అందరూ బాగుండాలని, తమ కాలేజీలో చదువుకునే పిల్లలు వారి కుటుంబాలు బాగుండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
కళాశాలలో మొత్తం 2వేల 6వందల మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలను సేకరించి వారికి వ్యాక్సిన్ అందజేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు.