- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వోకల్ ఫర్ లోకల్’.. ఆవు పేడతో సస్టెయినెబుల్ ప్రొడక్ట్స్
దిశ, ఫీచర్స్ : ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న భారత ప్రధాని మోడీ.. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ప్రతీ భారతీయుడి నినాదం కావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మాటలను ఆదర్శంగా తీసుకున్న ఉత్తరాఖండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒకరు.. స్థానిక ఉత్పత్తుల తయారీలో మహిళలకు తన వంతు సహకారం, ప్రోత్సాహమందిస్తూ మహిళా సాధికారితకు కృషి చేస్తోంది. ఇందుకు అటవీశాఖ నిధులను ఉపయోగిస్తోంది. కాగా ఈ ఉత్పత్తులు ఎకో ఫ్రెండ్లీ ప్లస్ సస్టెయినెబుల్ కావడం విశేషం.
ఉత్తరాఖండ్‌లోని భద్రిగాడ్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా గతేడాది బాధ్యతలు తీసుకున్న మేధావి కీర్తి.. అప్పటి నుంచి స్థానిక తెగలకు చెందిన మహిళలను ఎంపవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రకృతిని పరిరక్షిస్తూనే వారికి పని కల్పించాలనుకుంది. ఈ క్రమంలో పర్యావరణహిత దీపాలు తయారు చేయాలని నిర్ణయించుకున్న కీర్తి.. ‘రంగర్ దీదీ(Ranger Didi)’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలు సమాజంలో గౌరవం పొందాలని ఆశించింది. ఇక ఈ ప్రోగ్రామ్ కోసం కావాల్సిన మెషిన్ల కోసం ఆమె ఉత్తరాఖండ్ అటవీ శాఖ నిధులను ఉపయోగిస్తున్న కీర్తి.. డీఎఫ్ఓ సహకారంతో స్థానిక మహిళలను ఈ ప్రోగ్రామ్ కోసం ఒప్పించినట్లు తెలిపింది.
ప్రొడక్ట్స్ తయారీకి మహిళలకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆవు పేడ, ఇతర ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్‌తో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ధూప, దీపాలతో పాటు పలు పూజా సామగ్రిని ‘ధాత్రి’ పేరిట మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. ఈ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం కూడా తన వంతు ప్రయత్నాలు చేసిన కీర్తి.. ముస్సోరి, డెహ్రాడూన్ తదితర ప్రదేశాల్లో స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మహిళలతో స్వదేశీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.